పార్లమెంటులో చర్చకు సిద్దంగా లేని విపక్షం

ఆందోళనలపై మండిపడ్డ కేంద్రమంత్రి
న్యూ దిల్లీ,జూలై20:పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ‌వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో నిత్యావసర ధరలు, జీఎస్పీ పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ‌పట్టుబట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు.

కాంగ్రెస్‌ ‌కు సభ సజావుగా నడవడం ఇష్టం లేదని… అందుకే ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌ ‌చేసిన ట్వీట్‌ ఆ  ‌పార్టీ విధ్వంస వైఖరిని బయటపెట్టిందని అన్నారు. ఒకవైపు చర్చ జరగాలంటూనే మరోవైపు కాంగ్రెస్‌ ‌పారిపోతోందని పీయూష్‌ ‌గోయల్‌ ‌విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *