జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శుక్రవారం ఉపసర్పంచ్ లు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఉప సర్పంచులను ప్రభుత్వం పటించుకోవడం లేదని,ఉపసర్పంచ్ లు ఆసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు పై కార్యచరణ ఉంటుందని బిఆర్ఎస్ ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని అలక 20 మంది కి పైన పార్టీ మారాలా? వద్దా?అనే యోచనలో ఉప సర్పంచ్ లు ఉన్నారని తెలుస్తుంది. ప్రభుత్వ ఫోటో కాల్ పాటించకుండ శిలాపలకల పై పేర్లు రాయకపోవడం,కనీసం తమకు కూడా హోదా కల్పించకుండ పోవడం పట్ల ఉప సర్పంచులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.
పార్టీ మారే యోచనలో ఉప సర్పంచ్ లు





