పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 03: పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అన్నారు.గురువారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వివిధ పార్టీల నుండి తెలుగు దేశం పార్టీలో చేరడం జరిగింది. అనంతరం గ్రామంలో గ్రామ దేవతల ఆలయ నిర్మాణానికై లక్ష రూపాయల విరాళం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు.తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తున్నారని అన్నారు.రాబోవు ఎన్నికల్లో టీడీపీ పార్టీయే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు చంద్ర హాస్, నాయకులు రామన్న మాదిగ, బెస్త నర్సింలు,డాక్టర్ రాములు,కృష్ణ,మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ,సాయిలు, గ్రామస్తులు దోమ బసప్ప, రమేష్ బాబు, కర్రే చెన్నయ్య, చిన్న దస్తయ్య, చిన్నప్ప,చింతకింది దస్తయ్య,దోమ వెంకటయ్య, కర్రే కాషయ్య, కోతి కేశవులు,చెవిటి అనంతయ్య, బసయ్య, డోకుర్ వెంకటయ్య, కోల వెంకటయ్య,గుడిసె అంజి, ఓటర్ వెంకటయ్య, కోల నర్సింహులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



