చిన్నకోడూర్, ప్రజాతంత్ర, జూలై 14: చిన్నకోడూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరహరదీక్షకు పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గురుకుల పాఠశాల పేరేంటి కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మెట్ల శంకర్ లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్నచూపు ఎందుకని వారిని ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఎల్.ఐ.సి పాలసీ తో పాటుగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, రవి, విఠల్,బాలయ్య తదితరులు ఉన్నారు.


