పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే వ్యవస్థలన్నిటినీ వ్యాపార సరళిలోనే నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా సేద్య ఉత్పత్తులు,ఆహార శుద్ధి వంటివి అనేక పరిశ్రమలకు ఆధారంగా భాసిల్లుతున్నాయి.సేద్యాన్ని వ్యాపార దృక్కో ణంలో కాకుండా తరతరాల వృత్తి ధర్మంగా పరిగణించడం భారత్‌  ‌లోనే జరుగుతుంది.దేశ ఆదా యంలో 18 శాతానికి సేద్యమే ఆధారం. ఏడు దశాబ్దాల క్రితం 40 కోట్ల ఎకరాల్లో 25 కోట్ల వ్యవసాయ శ్రామికులతో ఉత్పత్తి చేసిన ఆహారధాన్యాలు ,అనుబంధ ఉత్పత్తులు 40 కోట్ల జనాభాకు సరిపోలేదు. అప్పట్లో విదేశాల నుంచి ఆహారధాన్యాల దిగుమతులకు అర్రులు చాచాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు అంటే భూమి నుంచి 120 కోట్లకు పైగా జనాభాకు ఆహారం ఉత్పత్తి చేయడంతో పాటు వేలకోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు చేయడం విశేషమే. వ్యవసాయ సాంకేతికతతో వచ్చిన మార్పులవల్లే ఇది సాధ్యమైంది. మూడు రేట్లు పెరిగిన జనాభాకు నాలుగు రేట్లు ఆహారధాన్యాలను భారత్‌ ఉత్పత్తి చేయకల్గింది.ఇది నిజమైన పురోగతి. అయినప్పటికీ అత్యధిక శాఖరులున్న మన దేశంలో అపరాలు, వంటనూనెల కొరతతో ఇప్పటికే వేలకోట్ల రూపాయల విలువ చేసే దిగుమతులు చేసుకుం టున్నాం. గడచినా అరవైఏండ్లలో వీటి ఉత్పాదకత, ఉత్పత్తులను దేశీయ అవసరాల మేరకు పెంచుకోవడంలో సఫలం కాలేకపోయాం.తెలంగాణ ప్రభుత్వం 2025 నాటికీ ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగును 25 లక్షల ఎకరా లకు పెంచాలన్న సంకల్పంతో ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌ద్వారా భారీ ఎత్తున ప్రకటించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలతో దేశంలో వంటనూనెల కొరత నెలకొంది.భారతదేశం ఆహార నూనెల వినియో గంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్‌. ఎం‌దుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది.

ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతున్నది. దేశంలో విస్తారమైన విభిన్న భూ, వాతావరణ పరిస్థితులు పామాయిల్‌ ‌తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం, దేశంలో ‘ఆయిల్‌ ‌పామ్‌’ ‌కేవలం 8.25 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, అం‌డమాన్‌, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, ‌కర్ణాటక, ఒడిశా, తమిళనాడు.. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో 48.25 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ ‌సాగు సంభావ్యతను గుర్తించితే, రాష్ట్రంలో ఇప్పటికే 8.14 లక్షల ఎకరాల సాగు ఇప్పటికే మొదలైంది.ఒకసారి పామాయిల్‌ ‌సాగుచేస్తే.. ఆ నాటిన మొక్క 30 ఏండ్ల వరకు నిరంతర ఉత్పత్తి ఇస్తుంది. ప్రధాన పంటగా పామాయిల్‌తో పాటు ఇతర అంతర పంటలు వేసే అవకాశం ఉన్నది. పామాయిల్‌ ‌తోటలు ఇతర నూనెగింజల పంటల కంటే 5నుంచి 8 రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ప్రపంచంలోని కూరగాయల నూనె డిమాండ్‌లో పామాయిల్‌ 35‌శాతం ఉన్నది.సాధారణంగా వేరుశెనగ నూనె వంటి వంట నూనె ధర కంటే సగం ధర పామాయిల్‌కు ఉంటుంది.ఇప్పుడు దేశంలో మొత్తం తినదగిన నూనె వినియోగంలో దాదాపు 25 మిలియన్‌ ‌టన్నులలో పామాయిల్‌ 30‌శాతం వాటా కలిగి ఉన్నది.ఇది బేకరీలు మొదలు గృహాల్లో వినియోగం వరకు అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉపయో గిస్తున్నారు.

ఎంతటి నిరుపేద వారైనా వంటలో మంచి నూనె వేయకుండా వండుకోరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత దేశం ఇటీవలే చ్కెనా దేశాన్ని మించిపోయింది.దేశంలో 85 శాతం మంది సన్న,చిన్నకారు రైతుల చేతుల్లో అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాల సాగుకు ఖర్చు తగ్గించేలా వ్యవ సాయ యాంత్రీకరణ జరగాలి. అన్ని విధాలుగా ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు అనువుగా ఉండటంతో  రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పోటీపడి సాగు చేసుకుంటున్నారు.దాదాపు 143 కోట్ల జనాభాకు దగ్గరవు తున్న భారత దేశ ప్రజలకు రోజుకు ఎంత మంచి నూనె కావాలి. అసలు ఒక కిలో మంచి నూనె తయారు చేయడానికి ఎంత వేరుశెనగ గింజలు కావాలి, పొద్దు తిరుగుడు గింజలు కావచ్చు, నువ్వులు కావచ్చు, పామాయిల్‌ ‌కావచ్చు ఒక కిలో నూనె తయారు చేయడానికి కనీసం మూడు నాలుగు కిలోల గింజలు కావాలి.వినియోగదారుడి అవసరాలను గుర్తించి వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున లాభాలు గడించే అవకాశం దక్కుతుంది.వ్యవసాయాన్ని సాంప్రదాయ వృత్తిగానే తప్ప ,వ్యాపార దృక్పథంతో అర్థం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్‌ ‌సాగును ప్రోత్స హిస్తుంది. నూనెగింజల ఉత్పత్తి దారుల సమాఖ్య (ఆయిల్‌ ‌ఫెడ్‌) ఆధ్వర్యంలో 6 జిల్లాల్లో పామాయిల్‌ ‌పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.ఒక్కో పరిశ్రమలో 2000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీని కోసం 1250కోట్లు వెచ్చించింది.

కనీసం ఎకరానికి 10టన్నులు దిగుబడి అనుకున్నా సంవత్సరానికి 1,35,000లు లాభం వస్తుంది. 30 సంవత్సరాల పాటు పెట్టుబడి లేకుండా ఎకరానికి రమారమి 1,35,000 అంటే రైతుకు నిజంగా కల్పవృక్షమే. రాష్ట్రంలో కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న కొత్త పరిశ్రమల ద్వారా రోజుకు 3600 టన్నుల మేరకు పామాయిల్‌ ఉత్పత్తి అవుతుంది. దేశంలో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదు…. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ఆ దిశగా వ్యాపార దృక్పథంతో యాంత్రికరణపై దృష్టి సారించలేదు. దేశంలో రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే వారికి అందిస్తున్న రైతు బంధు,రైతు భీమా లాంటి సంక్షేమ పథకాలతో పాటు, వ్యవసాయాన్ని వ్యాపారం వైపు బదలాయించాల్సిన అవసరం ఉంది.

image.png
డా. సంగనిమల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
‌సెల్‌ : 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *