పాపన్న స్ఫూర్తితో హక్కులు సాధించుకుందాం

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర ,ఆగస్ట్ 18; సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు ఏకమై తమ హక్కులను సాధించుకోవాలని మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు నిమ్మగూడెం సుధీర్ గౌడ్ కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వాయి పాపన్నచిత్ర పటానికి పూలు చల్లి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేశ్వరానికి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ పాపన్న సాగించిన పోరాటం మహత్తరమైందని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు పాపన్న జీవిత చరిత్రను భావితరాలకూ అందించాలని సూచించారు. గీతకార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.న్వేల కోట్లు, ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తే అందులో ఈత, తాటి చెట్లను పెంచుతామని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ రవిజర్వేషన్లను సైతం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గౌడ్, వర్కల యాదగిరిగౌడ్, నాయకులు మాదరం అంజనేయులుగౌడ్, బస్వ యాదయ్యగౌడ్, రాజేందర్ గౌడ్, హరికిషన్ గౌడ్, యాదయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *