పాపన్న గౌడ్ జీవితం చిరస్మరణీయం మంత్రి శ్రీనివాస్ గౌడ్

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 7:బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన పాపన్న గౌడ్ జీవితం తిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్స్ అన్నారు. బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ నందు నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్&ఎక్సైజ్,క్రీడలు,యువజన సేవలు పర్యాటక,సాంస్కృతిక మరియు పురావస్తు శాఖమాత్యులు శ్రీనివాస్ గౌడ్ మరియు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు,ప్రముఖులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శవంతుడు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *