పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. సోమవారం నేపాల్ రాజధాని ఖాట్మండు లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పశుపతి నాథ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పాండు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
పశుపతి నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్




