పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్‌ ఎగరేస్తుంది
మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని, పంచాయతీలకు ప్రతినెల నిధులు మంజూరు చేయడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్‌ ఎగరేస్తుందని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు. దేశ వ్యాప్తంగా పంచాయతీలకు కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లో మన తెలంగాణ ప్లలెలు అగ్రభాగాన నిలుస్తున్నాయి.

ఇప్పటికే అనేక అవార్డులను తెలంగాణ గ్రామాలు అందుకుని, ఇతర రాష్టాల్ల్రోని పల్లెలకు ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్టావ్రతతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సీఎం కేసీఆర్‌ ‌సాకారం చేశారని తెలిపారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న.. మహాత్మా గాంధీ ఆశయమే స్ఫూర్తిగా.. సీఎం గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. ప్లలె ప్రగతికి ప్రాణం పోశారని కేటీఆర్‌ ‌కొనియాడారు. నాడు.. దశాబ్దాల పాటు దగాపడ్డ ప్లలె.. నేడు.. దర్జాగా కాలర్‌ ఎగరేస్తుందని అభిప్రాయపడ్డారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు.. ఇవాళ సకల సౌకర్యాలతో వెలిగిపోతోందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ ‌సంకల్పంతో ప్రతి పల్లె సీమ.. ప్రగతిసీమగా మారిందని కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *