ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఆమనగల్లు మండలం పోలేపల్లి, మంగళికుంట తండా ల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పల్లె పల్లెకు ఇంటింటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామప్రజలతో మమేకమై ప్రధాని నరేంద్రమోధీ 9 ఏళ్ల సుపరిపాలన గురించి వివరించారు. అదేవిధంగా మంగళకుంట తండా కు చెందిన పలువురు యువకులు బిజెపిలో చేరారు. వారిని ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆమనగల్లు మాజీ జడ్పీటీసీ కండే హరిప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


