పల్లె, పట్టణ ప్రగతి వల్లే స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌లో నేడు తెలంగాణ టాప్‌

కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మం త్రిత్వ శాఖ 2016 నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌, ‌ప్రపం చంలోనే అతిపెద్ద పట్టణ పారి శుధ్యం, పరిశుభ్రత సర్వే. పట్టణాలు, నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంలో, పౌరులకు వారి సర్వీస్‌ ‌డెలివరీని మెరుగుపరచడానికి, పరిశుభ్రమైన నగరాలను రూపొందించడంలో ఇది కీలకమైనది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ‌ప్రాథమిక లక్ష్యం పెద్ద ఎత్తున పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, పట్టణాలు మరియు నగరాలను నివసించడానికి మంచి ప్రదేశాలుగా మార్చడానికి కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యత గురించి సమాజంలోని అన్ని వర్గాలలో అవగాహన కల్పించడం. స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌ (అర్బన్‌) ‌పరిధిలో నిర్వహించబడిన వార్షిక సర్వే, భారతదేశంలోని అన్ని నగరాల్లో తమ నగరం అత్యంత పరిశుభ్రమైనదని స్థిరమైన పద్ధతులను నిరూపించే ప్రయత్నంలో ప్రజలు, మౌళిక వనరులని, అధికారులను సమీకరించడానికి నిర్వహిస్తున్న సర్వే.
స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌లో దేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి పలు నగరాలు ఉత్తమ స్థానంలో ఉంటూ దేశంలోనే తెలంగాణ  టాప్‌ ‌లో ఉండేలా కృషి చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రకటించిన జూన్‌-2023 ‌ర్యాంకుల కేటగిరిలో  గ్రామీణలో మరోసారి తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. జూన్‌ ‌నెలకు 4 కేటగిరీల్లో తొలి 3 స్థానాల్లో నాలుగు జిల్లాలు నిలిచాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉన్నాయి. అచీవర్స్, ‌హై అచీవర్స్ ‌విభాగాల్లో 2, 3 స్థానాల్లో తెలంగాణ జిల్లాలు నిలిచాయి. అచీవర్స్ ‌కేటగిరీలో 2వ స్థానంలో హనుమకొండ, 3వ స్థానంలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లాలు, హై అచీవర్స్ ‌కేటగిరీలో రెండో స్థానంలో జనగాం, మూడో స్థానంలో కామారెడ్డి జిల్లాలు నిలిచాయి.
దేశవ్యాప్తంగా 400 పైచిలుకు పల్లెలు అవార్డుల జాబితాలో చేరగా, తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకొన్నది. అదే విధంగా గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి చెందిన జిల్లాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి, 2022 అక్టోబర్‌ ‌నుంచి డిసెంబర్‌ ‌వరకు త్రైమాసికానికి సంబంధించిన రెండు కేటగిరీల్లోనూ రాష్ట్రానికి చెందిన జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. 4 స్టార్‌ ‌కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, పెద్దపల్లి జిల్లా మూడోస్థానంలో నిలిచింది. 3 స్థార్‌ ‌కేటగిరీలో సిద్ధిపేట మొదటి స్థానంలో నిలవగా, జగిత్యాల జిల్లా రెండోస్థానంలో నిలిచింది.4 స్థార్‌ ‌కేటగిరీలో మొదటిస్థానంలో సిరిసిల్ల నిలిచింది. దేశంలో స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌ (‌గ్రామీణ్‌) ‌ఫేజ్‌-2 ‌కార్యక్రమం కింద అత్యధిక బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్‌ ‌ప్లస్‌) ‌గ్రామాల జాబితాలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఈ విధంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ ‌నెలవారీ నివేదికల్లో మరోసారి టాప్‌ ‌లో తెలంగాణ ఉండటం గర్వించదగ్గ హర్షణీయం. పల్లె, పట్టణ ప్రగతి పథకం అమలు ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు, వాటి నిర్వహణ ఆధారంగానే నేడు ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.  గ్రామీణ, నగర అభివృద్ధిలో ఈ కార్యక్రమాల పాత్ర కీలకం. దేశంలో కేంద్రం ఇస్తున్న పలు అవార్డు లలో తెలంగాణా ముందజలో ఉంటూ నేడు, దేశానికే ఆదర్శంగా మారి, స్వచ్ఛ తెలంగాణను చేయడంలో ప్రముఖ పాత్ర పోషితున్నాయి.
image.png
డాక్టర్‌ ‌శ్రవణ్‌ ‌కుమార్‌ ‌కందగట్ల
86393 74879

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *