జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా
నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర నల్లటి ఆకృతిని ఏర్పరుస్తాయన్న విషయం అర్థంచేసుకుని క్రమంగా ఫొటోగ్రఫీ ఆవిర్భావానికి బీజం వేసాడు మానవుడు. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు.రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ‘‘ఫోటో అంటే చిత్రం’’, ‘‘గ్రఫీ అంటే గీయడం’’ అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుకు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాల క్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది.
పూర్తి రూపం ఇచ్చి ఫోటోగ్రఫీ అనే ప్రక్రియను ప్రపంచానికి తెలియ జెప్పేందుకు ఆ తర్వాత మరో 280 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో ఎందరెందరో పరి శోధకులు ప్రయోగాత్మకంగా దృశ్యాన్ని లోహం మీద బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఆ ఖ్యాతి దక్కింది ఎల్.జె.ఎల్. కు, 1837 ఫ్రెంచి ప్రభుత్వం ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ముందు డాగురే తాను కనుగొన్న ఒక కొత్త పరి కరాన్ని ప్రదర్శించాడు. బయటవున్న చిత్రాన్ని ఒక నల్లటి ఫలకంపై ముద్రించి, ఆ పైన దానిని ప్రాసెస్’ చేసి ఆ చిత్రాన్ని శాశ్వతంగా ప్రదర్శించ గలిగినదే ఆ ప్రక్రియ. అది జరిగింది జనవరి 9, 1839. ఆ అద్భుత మైన ఆవిష్కారానికి హక్కులు పరిశోధకుడికి ఇచ్చారు. అయితే ఇది ఒక వ్యక్తి హక్కు కాకూడదని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం, ఆ పాటోగ్రఫీ పేటెంట్ తాను కొనుగోలు చేసి, ప్రపంచానికి ఉచిత బహుమతిగా ప్రకటించిన తేదీ ఆగష్టు 19, 1839. అలా ప్రపంచమంతా పోటోలు తీసుకునే హక్కును పొందిన ఆ తేదీని ప్రపంచ పాటోగ్రఫీ దినోత్సవంగా జరుపు కుంటారు.
డిజిటల్ కెమెరా, చిత్రాలు మరియు వాటి ఆవిష్కరణ జ్ఞాపకార్థం జూన్ 29 న జాతీయ కెమెరా దినోత్సవం జరుపుకుంటారు. డిజిటల్ కెమెరా అనే పదం లాటిన్ పదబంధం ‘‘డిజిటల్ కెమెరా అబ్స్క్యూరా’’ నుండి ఉద్భవించింది, ఇది ‘‘చీకటి గది’’ అని సూచిస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని 1826 లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసెఫ్ నికోఫోర్ నిప్సే డిజిటల్ కెమెరా అబ్స్క్యూరాతో తీశారు. ప్రాధమిక 35 ఎంఎం ఎస్ఎల్ఆర్ డిజిటల్ కెమెరాను ఇహాగీ – కైన్ ఎక్సాక్తా 1 ప్రారంభించింది. ప్రాధమిక రంగు •ఛాయాచిత్రం 1861 ను స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ ప్రారంభించారు. ప్రపంచంలోని మొట్టమొదటి రంగు ఛాయాచిత్రం గులాబీ, నీలం మరియు పసుపు వడపోతల ద్వారా 3 సార్లు ఫోటో తీయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన టార్టాన్ రిబ్బన్, ఇది ఒక రంగు మిశ్రమంగా తిరిగి కలపబడింది. 1878 లో, ఇంగ్లీష్ ఫోటోగ్రాఫర్ ఈడ్వర్డ్ ముయిబ్రిడ్జ్ చలనంలో మొదటి ఛాయాచిత్రాన్ని రూపొందించారు, తరువాత ఇది మొదటి కదలిక ఫోటోలకు దారితీసింది.నీటి అడుగున ఫోటోగ్రాఫ్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని ఫ్లోరిడా కీస్‌ను డాక్టర్ విలియం లాంగ్లీ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ వర్కర్స్ ఫోటోగ్రాఫర్ చార్లెస్ మార్టిన్ 1926 లో తీశారు. నాసా యొక్క అపోలో 11 మూన్ మిషన్లలోని ఛాయాచిత్రాలను స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించిన మూవీని కొడాక్ తయారు చేసింది. ప్రస్తుతం, అతిపెద్ద డిజిటల్ కెమెరా కలగలుపు ముంబైకి చెందిన ఫోటో జర్నలిస్ట్ దిలీష్ పరేఖ్ సొంతం. అతను 4,425 పాతకాలపు కెమెరాలను కలిగి ఉన్నాడు.
మనదేశంలో 1857 వరకు ఫోటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటిష్ రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని ఉపయోగించే వారు. 1977 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో మొట్ట మొదటి సారిగా లాలా దీనదయాళ్ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. సమయం, సందర్భం ఏదైనా, నేడు ఫోటో లేని జీవితం ఊహించుకోలేం.ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది.అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి, అంతిమ యాత్ర వరకు ప్రతి దశ కెమెరాతో బంధించాల్సిందే. ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ ఒక కెమెరా. సెల్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫిలో నైపుణ్యం పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ తీసే ఫోటో చూస్తే కలిగే ఆనందం వేరు. నలుపు తెలుపు అయినా, సప్త వర్ణాలతో తీసింది అయినా మనసును తట్టి తీరుతుంది. ఎందరెందరో కెమెరాతో ట్రిక్కులు చేస్తున్నారు. తమ సృజనను ప్రదర్శిస్తున్నారు
– రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494




