పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో బుధవారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సాయి రామ్ నగర్ కాలనీలో పర్యటించి స్థానిక కాలనీవాసులతో మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొన్ని చోట్ల రోడ్ల సమస్య ఉందని కార్పొరేటర్ కి తెలియజేయగా జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ తో మాట్లాడి నూతన సీసీ రోడ్డు నిర్మాణం కొరకు అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది.అనంతరం పటాన్ చెరు, బండ్లగూడ లోని నేతాజీ నగర్ కాలనీలో స్థానిక సమస్యలను పరిశీలించడం జరిగింది. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీకి సమీపంలో ఉన్న చెరువు నీరు భారీ వర్షాలకు కాలనీలోకి వస్తున్నాయని తెలియజేశారు. తప్పకుండా జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.



