పలుగుట్ట గ్రామంలో భూసారంపై అవగాహన కార్యక్రమం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్13: చేవెళ్ల మండల పరిధిలోని పలుగుట్ట గ్రామపంచాయతీ నందు  భూసారం( నేల ఆరోగ్యం) భూసార యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించమని వ్యవసాయ అధికారి తులసి అన్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్ గారి జనార్దన్ రెడ్డి ఉప సర్పంచ్ యాదమ్మ రాములు గ్రామ రైతులు పాల్గొన్నారు.సోయల్ అండ్ ల్యాండ్ యూస్ సర్వే ఆఫ్ ఇండియా రాజేంద్రనగర్ నుండి శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారి తులసి విస్తరణ అధికారులు స్వాతి వరుణ్ రమేష్ బాలకృష్ణ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.రైతులతో భూసార యాజమాన్యం గురించి చర్చించిన అనంతరం మట్టి నమూన డెమో కార్యక్రమం నిర్వహించమన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి వై సురేష్ కుమార్, అసిస్టెంట్ సోయల్ సర్వే ఆఫీసర్, మరియు అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డి.రాజా,ఏ.పర్టీభాన్,అల్ సిండే,ఎస్ కె త్రిపాటి,ఎస్ కె కుమావత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *