పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని, మన కోసం ముందు తరాల వారి కోసం ప్రకృత్తిని కాపాడుకోవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గల 23వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రంలో కాలుష్యం తగ్గి వర్షాలు సమృద్దిగ కురుస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచాలని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం వల్ల వాతావరణం కాలుష్యం కాకుండా మనల్ని కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు భాద్యతగ తీసుకొని మొక్కలు పెంచిచే కాలుష్యం పెరగకుండా ఉంటుందన్నారు. ఇప్పుడు మనం పెంచే మొక్కల వల్ల తరువాత వచ్చే తరాణికి కాలుష్యం లేకుండా మంచి వాతావరణనాన్ని ఇచ్చినవాళ్ళం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్, ప్రియాంక, ఆర్పీలు బాలమణి, అనిత మేడ్చల్ మున్సిపల్ సిబ్బంది మహిళలు 23వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *