పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 2 : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని,  గ్రామపంచాయతీ ట్రాక్టర్ లోనే  ప్రతిరోజు చెత్తను వేయాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ని అనుసరించి చర్యలు తీసుకొనునట్లు తెలిపారు. గ్రామ ప్రజలు సకాలంలో ఇంటి పనులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయక్ అలీ, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *