వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించిన పోలింగ్ అనంతరం కౌంటింగ్ సెంటర్ కు తరలించిన ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిగి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ లో జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్క్రూటీని నిర్వహించి స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి సీల్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులతో పాటు నాలుగు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, విజయ కుమారి, శ్రీనివాసరావు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.
పరిగి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంల తరలింపు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కౌంటింగ్ పరిగి లోనే





