హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : సన్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10.85 కోట్లు సమీకరించాలని యోచిస్తుందని సన్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రిప్షన్ నవంబర్ 7 న ప్రారంభం అవుతుందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించడానికి కంపెనీ ఆమోదం పొందిందని చెప్పారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తంతో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, జనరల్ కార్పొరేట్ అవసరాలతో సహా కంపెనీ విస్తరణ ప్రణాళికలకు నిధులను సమకూరుస్తారన్నారు. మార్క్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్ గా వ్యవహరిస్తుందన్నారు. పబ్లిక్ ఇష్యూ నవంబర్ 9 న ముగుస్తుందన్నారు.




