సంపన్నుల పాలనలో
పేదోడిబతుకు ఎండమావయ్యింది
ఉన్నోడికి ఉన్నదంతా ఊడ్చిపెట్టడమే ఆనావాయితి
పుడితే పన్ను చస్తే పన్ను
సపాటుసాగాలంటే
సరుకులెలా కొనాలో
రూపాయి విలువతగ్గి
జీవనం అతలాకుతలం
జీవనోపాధి కల్పించని పాలకులు
ఏకాకినిజేసేస్తూ చేతకానితనంతో దేశభక్తి గీతమాలపిస్తున్నరు
ఏమనడిగితే చాలూ
దేశద్రోహులౌతున్నరు
ఈసురోమని పాలకులుంటే
దేశమేగతి బాగుపడునోయ్‌
ఓట్లనన్ని దోచుకెళ్ళి
షేర్‌ ‌మార్కెట్లో తాకట్టువెడుతున్నరు
దోచుడే పరమావధిగా
సాగుతున్న పాలనలో
గమనం ఆగిపాయే
నిత్యవసరాలన్ని నింగిలోనే
కత్తిపోటుకన్నా
గన్నుపోటుకన్నా
ప్రభుత్వం విధించే పన్నుపోటే
నేడు ప్రమాదం
చడిచప్పుడులేకుండా
గంభీరమైన దోపిడిది
దీనికిపుడు అడ్డేలేదాయే
    – సి. శేఖర్‌(‌సియస్సార్‌), ‌పాలమూరు, 9010480557.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *