ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : పడమటి తండ గ్రామపంచాయతీ పరిధిలోని తాళగుట్ట తండా లో గ్రామపంచాయతీ నిధుల నుండి రూ.60 వేలతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులను సర్పంచ్ బుజ్జి కృష్ణ నాయక్ తో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ చెర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుల్యా నాయక్, వార్డ్లు మెంబర్ శంకర్ నాయక్, రాగు నాయక్, గోపాల్ నాయక్, నాయకులు రతన్ నాయక్, జబర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, గోపాల్ నాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.




