ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మంగళపల్లి సర్పంచ్ తిప్పిరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. మంగళపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎంపిటిసి నిధుల నుండి రూ.2 లక్షల 80 వేల తో పనులు ప్రారంభించడం జరిగిందని ఇంతకు ముందు కుడా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందనీ దానితో భవనం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, సర్పంచ్ నర్సింహా రెడ్డి, మాజి సర్పంచ్ జంగయ్య, మండల్ ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, మాజి ఉపసర్పంచ్ గండికోట మురళి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కడారి వెంకటేష్, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




