పదేళ్లలో వందేళ్ల విధ్వంసం

అభివృద్ధి పేరుతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి
కుంగిపోయిన మేడిగడ్డను ఎలా బాగుచేయాలో చెప్పరు..
బిజెపి, బిఆర్‌ఎస్‌ నేతల ఎజెండా కాంగ్రెస్‌ను తిట్టడమే
మోదీనే మరోమారు ఎందుకు ఎన్నుకోవాలో వారు చెప్పాలి
సింగరేణి కార్మికులకు కోట
బీమా పథకం ప్రారంభించిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌..తన పదేండ్లలో ఎన్నడూ లేనంతగా వందేళ్ల విధ్యంసం చేసిందని ముఖ్యంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో కసరత్తు చేస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడిరచారు. బ్యాంకులతో ఎంఓయూ చేసుకున్నామని తెలిపారు. గత పాలకులు సింగరేణిని ప్రవేటు పరం చేసే కుట్ర చేశారని ఆరోపించారు. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌ రెడ్డి విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మనం బ్యాంకులకు కట్టాల్సిన అప్పే రూ.70వేల కోట్లు ఉంది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల సంక్షోభంలోకి నెట్టారు. ధనదాహానికి బలైన ప్రాజెక్టులను ఏం చేయాలో అర్థం కావడంలేదు. కుంగిన మేడిగడ్డను ఎలా బాగు చేయాలో సలహా ఇవ్వరు. పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెడ్తాం.. చర్చించేందుకు బిఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా?..అని రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తున్నామని, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, బిఆర్‌ఎస్‌, బిజెపి కలిసి కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నాయని, స్వార్థం కోసం బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని వారి విమర్శలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణను అంధ్రావాళ్ల కంటే ఎక్కువ విధ్యంసం చేసిన ఘనత కెసిరఆర్‌ దేనన్నారు. ఇంకా బిఆర్‌ఎస్‌ నేతలు అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనకు.. బిజెపి పాలనకు తేడా ఏముందని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి సహకరించడంలేదని, హైదరాబాద్‌ వరదల్లో మునిగితే.. కిషన్‌ రెడ్డి ఏం తీసుకొచ్చాడని, మూడోసారి మోదీని ఎందుకు ప్రధానిని చేయాలని ప్రశ్నించారు.

దిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతులను కాల్చి చంపడానికా…అంటూ సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక  సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్‌ రెడ్డి సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సంస్థ కూడా కీలక పాత్ర పోషించిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. 2014లో మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని, కానీ రాష్టాన్న్రి కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 43 వేల మంది కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా పథకం అమలు చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు మొత్తంగా రూ.1.20 కోట్ల పరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉందని, ఇప్పుడు సింగరేణి కార్మికులకు అంత మొత్తంలో ప్రమాద బీమా అమలు చేస్తున్నామని సింగరేణి ఎండీ బలరామ్‌ అన్నారు. పెద్ద మొత్తంలో సింగరేణి కార్మికులకు బీమా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *