సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: మనకు ప్రత్యర్థితో పోటీ కాదు.. మెజారిటీతోనే పోటీ ఉంటుందని, సిద్దిపేట పట్టణ 24వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తో కలిసి వార్డుస్థాయి భూతు కన్వీనర్లు,వంద ఓట్ల ఇoన్చార్జులు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సిద్దిపేట భారస అభ్యర్థిగా, మంత్రి తన్నీరు హరీశ్ రావు గెలుపు తధ్యం అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ఓటర్లు హరీశ్ రావుని ఎంత మెజారిటీతో గెలిపించుకోవడo అనేదే ముఖ్యం అని అన్నారు. సిద్దిపేట పట్టణంలో అన్ని వార్డులలో పోలింగ్ శాతం పెరగాలని అన్ని వార్డుల కౌన్సిలర్లు ఆ దిశగా తమ వార్డు బుతు స్థాయి కన్వీనర్లను, వంద ఓటర్ల ఇంచార్జిలను ప్రతి వార్డులో క్రమం తప్పకుండా ప్రజల వద్దకు వెళ్లి మన కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.ప్రత్యర్థితో పోటీ కాదు…. మెజారిటీతోనే పోటీ.సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల కంటే 24 వ వార్డులోనే అధిక పోలింగ్ శాతం అయ్యేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సిద్దిపేట నియోజకవర్గoలోని ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడు మంత్రి తన్నీరు హరీశ్ రావు అని, ఆపదలో ఉన్న,సంతోషంలో ఉన్న మనకు మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి మంత్రి హరీశ్ రావు అని అన్నారు. అందరికి వెన్నుదన్నుగా నిలిచే గొప్ప మనసున్న నాయకుడు మంత్రి హరీశ్ రావు అని చెప్పారు.మళ్ళీ ఒకసారి భారీ మెజారితో ,సిద్దిపేట ఎమ్మెల్యే గా మంత్రి హరీశ్ రావుని గెలిపించుకొని సిద్దిపేట పేరుని రాష్ట్ర వ్యాప్తంగా వినబడేలా చేద్దాం అని చెప్పారు.ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకం లక్ష్మణ్, గుండ్ల యోగేందర్, ఎడ్ల అరవింద్ రెడ్డి, కో-అప్షన్ సభ్యులు సత్తయ్య,జిల్లా సివిల్ సప్లై సభ్యులు నాయకం వెంకటేష్, వార్డు బిఅరెస్ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు,వార్డు బిఅరెస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ అన్ని వార్డుల కంటే 24వ వార్డులో అధిక పోలింగ్ శాతం కావాలి





