సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్ సైన్యాలు అదే నిజామ్ తో చేతులు కలిపి పటేల్ ,జనరల్ చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్ వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన నిజామ్ రాజ్యాన్ని బలహీనం చేసి విలీనానికి దోహదం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ని గౌరవించకుండా చర్చలు జరపకుండా వారిని నిర్ములించే ప్రయత్నాలు చేసింది.
గత రెండు వందల ఏళ్ల చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పోల్చదగిన ఉద్యమం మరొకటి లేదు.ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదానికి ,రాచరికానికి ,భూస్వామ్యదోపిడీకి వ్యతిరేకంగా ,భూపంపకము,వెట్టి చాకిరి రద్దు కోసం వంటి పలు అంశాలను ఏకకాలంలో ఎజెండాలో చేర్చుకుని నిర్వహించబడిన అద్వితీయ పోరుగా రైతాంగ పోరాటం ప్రసిద్ధి కెక్కింది . 1920 నుండి 1951వరకు ఆంధ్ర మహా సభ దాని రూపాంతరంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ బడిన సాంఘిక రాజకీయ ఆర్ధిక పోరాటాలు తెలంగాణ సమాజాన్ని గొప్ప ముందడుగు వేయించాయి .15 ఆగస్ట్ 1947 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా నిజామ్ రాజు హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయకుండా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు.ఇది సంస్థాన ప్రజలలో మరింత ఆగ్రహాన్ని• •లిగిం చింది.కమ్యూనిస్ట్ సాయుధ దళాలు తమ గెరిల్లా పోరాటాలతో రాజు మూలస్థంభాలైన భూస్వామ్య జాగిర్దార్ లను కూలదోశారు.పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
హైదరాబాద్ నగరం మినహా తెలంగాణ మొత్తం కమ్యూనిస్ట్ లు గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు .నిజామ్ రాజుని నగరానికి పరిమితం చేశారు.సాయుధ సమర సేనాని రావినారాయణ రెడ్డి అభిప్రాయంలో సాయుధ దళాల మద్దతుతో ప్రజా వెల్లువతో 1948 ఆగస్ట్ నాటికి రాచరికాన్ని కూలదోసి ప్రజారాజ్యాన్ని కమ్యూనిస్ట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైందని ప్రకటించాడు.ఈ పరిణామాలను పచ్చి కమ్యూనిస్ట్ వ్యతిరేకి గా ఉన్న అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గమనిస్తూ నిజామ్ రాజుతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాడు.గెరిల్లాల అణిచివేతకు కావాల్సిన ఆయుధ సహాయాన్ని అందిస్తూవచ్చారు.
30జనవరి 1948 గాంధీ హత్య ఉదంతం తర్వాత అప్పటి హోమ్ మంత్రి పై విమర్శల దాడి జరిగింది. విభజన కాలంలో జరిగిన మత కల్లోలాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారని భావించిన గాంధీ దిల్లీలో నిరాహార దీక్ష చేశారు. గాంధీకి రక్షణ కల్పించడంలో పటేల్ పట్టించుకోలేదని అత్యధిక కాంగ్రెస్ సభ్యులు, సోషలిస్టు నేతలు పటేల్ పై విరుచుక పడ్డారు .అనామక న్యాయవాది గా ఉన్న పటేల్ ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన గాంధీ పట్ల సరైన బాధ్యతతో లేడు అని అపవాదు పటేల్ పై మోపబడింది.సొంత ప్రతిభ నాయకత్వ మేధో లక్షణాలతో ఉన్న ప్రధాని నెహ్రు పై పటేల్ తీవ్ర అసూయను పెంచుకున్నాడు.1948లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి పి సి జోషి సోషలిస్టు స్వభావం ఉన్న నెహ్రు పాలనకు మద్దతుగా నిలిచాడు.హిందూ మహాసభ వంటి మత వాద సంస్థలతో ఉదారంగా ఉంటూ ప్రధాని పదవిని ఆశిస్తున్న పటేల్ నెహ్రు కు అండగా కమ్యూనిస్ట్ ల మద్దతును సహించ లేకపోయాడు. నిజామ్ రాజు తన సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా ఉంటామని భారత ప్రభుత్వంతో సెప్టెంబర్1947 లో యథాతథ ఒప్పందం చేసుకుంది.కానీ హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్ట్ ల పరమైంది .రష్యా విప్లవంలో జార్ చక్రవర్తులకు జరిగిన అనుభవం తమకు ఎదురుకావడానికి ఎంతో కాలం పట్టదని తెలుసుకున్నారు.వెంటనే నిజామ్ రాజు భారత ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు .భారత స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసినట్లుగానే నిజామ్ రాజు ఒక ఫర్మాన జారీ చేసి భారత రాజ్యాంగం తన రాజ్యంలో అమలులోకి వస్తుందని భారత్ లో విలీనమైంది ప్రకటించాడు.
యుద్ధ నేరాల క్రింద రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ను విచారణ చేసి శిక్షిస్తారని సంస్థాన ప్రజలు ఆశించారు.కానీ పటేల్ ప్రత్యేక ప్రేమను కనపరచి నిజామ్ రాజు ను రాజ ప్రముఖ్ గా ప్రకటించి కోటి డెబ్బై లక్షల భరణాన్ని ప్రకటించాడు.పటేల్ దగ్గరుండి సంస్థాన ఆస్తులను నిజామ్ కి ధారాదత్తం చేసి ఇచ్చాడు.జాగిర్దార్ లకు నగదు ప్రతిఫలం ఇచ్చారు.దారుణ అకృత్యాలు, దహనకాండ మానభంగాలు హత్యలు చేసిన హిందూ భూస్వాములను,రజాకార్ ల పై నామ మాత్ర చర్యలు కూడా తీసుకోలేదు. మారణ కాండ కొనసాగించిన రజాకార్ నేత ఖాసీమ్ రజ్వి పై షోయబుల్లాఖాన్ హత్య కేసు ,బీబీనగర్ దొమ్మీ కేసు లు పెట్టారు.పటేల్ రజ్వి కోసం ప్రభుత్వం తరపున న్యాయవాదిని పెట్టి విడుదల చేయించాడు . సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్ సైన్యాలు అదే నిజామ్ తో చేతులు కలిపి పటేల్ ,జనరల్ చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్ వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన నిజామ్ రాజ్యాన్ని బలహీనం చేసి విలీనానికి దోహదం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ని గౌరవించకుండా చర్చలు జరపకుండా వారిని నిర్ములించే ప్రయత్నాలు చేసింది.
ప్రజలు సాధించిన విజయాల రక్షణ కోసం బిటిరణదీవె కార్యదర్శిగా ఉన్న 1948 కలకత్తా కమ్యూనిస్ట్ సమావేశం ప్రతిఘటన పోరాటాన్ని కొనసాగించమని పిలుపునిచ్చింది.పటేల్ కమ్యూనిస్ట్ లపై గల ద్వేషంతో అపార మానవ నష్టం జరిగింది .సరోజినీ దేవి బిడ్డలైన జయసూర్య పద్మజ నాయుడులు యూనియన్ సైన్యం అకృత్యాలను నెహ్రు కు నివేదించారు.నెహ్రు వేసిన కమిషన్ నివేదికలో వేలమందిని సైన్యాలు పొట్టన పెట్టుకున్నాయని తెలియచేసింది .
ఇదే సమయంలో ప్రజలలో కమ్యూనిస్ట్ ల ప్రభావం తగ్గించడం కోసం జాగిర్దార్ వ్యవస్థను రద్దు చేశారు.కౌలు దారులకు భూమి పై హక్కులను కల్పించారు.భారత ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అమలు చేస్తామని ప్రకటించింది. భూసంస్కరణ చట్టాలను రాజ్యాంగంలో చేర్చింది.దీనితో ప్రజల పోరాట సంసిద్ధత తగ్గడంతో 21అక్టోబర్ 1951 లోసాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విరమించింది.పోరాట విరమణ తర్వాత,ఆయుధాలు అప్పగించిన కూడా పటేల్ సంవత్సరమంతా కమ్యూనిస్ట్ లు బలంగా ఉన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాలలో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాడు.
ఇదే సమయంలో ప్రజలలో కమ్యూనిస్ట్ ల ప్రభావం తగ్గించడం కోసం జాగిర్దార్ వ్యవస్థను రద్దు చేశారు.కౌలు దారులకు భూమి పై హక్కులను కల్పించారు.భారత ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అమలు చేస్తామని ప్రకటించింది. భూసంస్కరణ చట్టాలను రాజ్యాంగంలో చేర్చింది.దీనితో ప్రజల పోరాట సంసిద్ధత తగ్గడంతో 21అక్టోబర్ 1951 లోసాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విరమించింది.పోరాట విరమణ తర్వాత,ఆయుధాలు అప్పగించిన కూడా పటేల్ సంవత్సరమంతా కమ్యూనిస్ట్ లు బలంగా ఉన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాలలో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాడు.
నిషేధ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ peoples democratic front పేరుతొ పోటీ చేసి తెలంగాణలో అత్యధిక సీట్లను గెలుచుకుంది.తెలంగాణ అప్పుడు ఒక రాష్ట్రంగా ఉంటే ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామికంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి ఉండేది .వారి పోరాటాలు విజయాలు అనేక ప్రగతిశీల విలువలను దేశానికి అందించింది. ఇవి భారత చరితలో హృదయ స్పందనలు ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి. సెప్టెంబర్ 17కి దారితీసిన ఇలాంటి ఉజ్వలమైన తెలంగాణ గత చరిత్ర మీద ఉమ్మడి రాష్ట్రంలో కప్పి పెట్టారు.తెలంగాణ విలీన ఘనతను కాంగ్రెస్ కు పటేల్ కు కట్టబెట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆ చేదు అనుభవాలకు క్షమాపణ చెప్పాలి.
ఇది ఇలా ఉంటే పోరాటాల వారసత్వం కానీ ,భాగస్వామ్యం లేని మతోన్మాద అతి జాతీయవాదులు విలీన చరిత్రకు మసి పూసే ప్రయత్నాలకు తెగబడుతున్నది .ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాయుధ పోరుని స్వరాజ్య సమరంలో భాగమని గుర్తించి పెన్షన్ల ను మంజూర్ చేసింది .బి జె పి మాత్రం హిందు ముస్లిం పోరాటంగా చిత్రీకరించి రెచ్చగొట్టి వోట్లను దండుకోవాలని చూస్తున్నది.1970లో ఇందిరా గాంధీ సంస్థానాల రాజులకి భరణాలను రద్దు చేస్తున్నప్పుడు బిజెపి వాజ్ పేయి వ్యతిరేకించారు.8 ఏండ్లపాలనలో ధరల అదుపు,నల్ల ధనం వెలికితీత ఉద్యోగాల కల్పన ఇంకా అనేక రంగాలలో మోదీ ప్రభుత్వం విఫలమైంది.ఫాసిస్ట్ స్వభావంతో గుత్త పెట్టుబడిదారీ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నది.ఈ వర్గాలకు కార్పొరేట్ పన్నును 34% తగ్గించి లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూరుస్తున్నది.లక్ష కోట్లకు మించని నిరుపేదల జీవన హక్కు సామాజిక భద్రత పథకాలను ఉచితాలని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది .ఈ చర్యలతో ప్రజలలో అనుకూలత తగ్గి ఇప్పుడు ఉన్న స్థానాలలో సగానికి తగ్గే అవకాశమున్నదని తేలిపోయింది.తెలంగాణ ఏర్పాటును అపహాస్యంగా మాట్లాడిన మోదీ తెలంగాణ కు ప్రయోజనకరమైన పనులు ఒక్కటి కూడా చేయలేదు. ఇక్కడి ప్రజల జీవితాలలో ఎలాంటి ప్రభావం లేని బిజెపి ఇక్కడి చరిత్రను వక్రీకరిస్తున్నది.తన విద్వేషపు ఆక్టోపస్ ను తెలంగాణ లో విస్తరించే కుట్రలకు పాల్పడుతున్నది. ఇంకా తెలంగాణ అస్తిత్వం ప్రమాదపు అంచులలో ఉంది.వైవిధ్యాలతో సుసంపన్నమైన సంస్కృతిని విద్వేష మందుపాతర్ల నుండి కాపాడుకునే కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ ప్రజలు, మేధావులు, ప్రజాస్వామి కవాదులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాల్సిన దశ ఇంకా మిగిలే ఉంది.అప్పుడు మాత్రమే ఇప్పటి వరకు ఉన్న మత సామరస్య సహజీవన విలువల తెలంగాణ కొనసాగుతుంది.ఇది దేశమంతటా అనేక తెలంగాణ లు ఏర్పడటానికి చోదకశక్తిగా నిలుస్తుంది.
– అస్నాల శ్రీనివాస్, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్
9652275560
– అస్నాల శ్రీనివాస్, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్
9652275560




