పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ సస్టైనబుల్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా  ఏర్పాటైన వార్డులో నవజాత శిశువులకు తొలి రోజుల్లో వచ్చే వైద్య సమస్యలకు అత్యాధునిక వైద్యం లభిస్తుందని తెలిపారు. పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వసుంధర, ఆస్పత్రి సలహా కమిటీ సభ్యులు శీనయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *