పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు నియోజకవర్గ సగర (ఉప్పర) సంఘం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలుస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఉప్పరి సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో నవ శకాన్ని ప్రారంభించారని తెలిపారు.ఒకపక్క సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి రాష్ట్రమంతట సుడిగాలి పర్యటనలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు నీటి వరకు అభ్యర్థులను ప్రకటించకుండా నోటుకు ఓటు వలె సీట్లను అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ఢిల్లీకి గులాములుగా పనిచేసే ప్రతిపక్ష పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, గోవింద్, పృథ్వీరాజ్, కుమార్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు దార్శనికుడు ఎమ్మెల్యే జిఎంఆర్




