పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 23: ఈవీఎం, వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలోకి ఎవరు రాకుండా గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలోని ఈవీఎం, వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఈవీఎం, వివి ప్యాట్స్ ను సిద్ధంగా ఉంచాలని ఈసీఐఎల్ ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరిని స్ట్రాంగ్ రూమ్ లోకి అనుమతించకూడదని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్స్ సందర్శనలో పరిగి రిటర్నింగ్ అధికారి విజయ కుమారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్, ఈవీఎం నోడల్ అధికారి పురుషోత్తం లు ఉన్నారు.
పకడ్బందీ చర్యలు చేపట్టాలి..ఎన్నికలు సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి





