వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలో నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు మూడు నెలలు పైబడిన పందులలో వ్యాపించే క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాధి నిర్మూలనకు పందుల కాపరులు తమ పందులకు తప్పని సరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. అనిల్ కుమార్ తెలిపారు. క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధి సోకితే పందులలో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కళ్ళు ఎర్రబడి నీరసంగా ఉండి నరాల బలహీనతతో నడకలో మార్పు వచ్చి పందులు చనిపోతాయని తెలిపారు. జిల్లాలో ఈ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 9940 పందులు గలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడి డా. ప్రహ్లాద్, సిబ్బంది హాజీ, జగన్ తదితరులు పాల్గొన్నారు.
పందుల వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలి



