పండుగలలో ఆధ్యాత్మికత లోపిస్తుందా…

  • ప్రతిబింబిస్తున్న పాశ్చాత్య(విదేశీ) సంస్కృతి
  • వేషధారణలో ఆధునిక పోకడలు…
  • ఆచార వ్యవహారాల్లో  కనిపిస్తున్న తేడాలు…

‘శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, తదితర పండుగలు వస్తున్నయంటే  ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది పొద్దున్నే లేచి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసే ఓపికతో ఆధ్యాత్మికత భావన కలిగి పండుగ మొదలు అయిపోయే వరకు పండగ సందర్భంకు అనువైన ప్రత్యేక పూజలు నిర్వహించి  బందు సమేతంగా వచ్చిన కుటుంబాలతో ఒకరికొకరు ఆధ్యాత్మిక చింతనతో సంతోషంగా ఆనందంగా భక్తి పారవశ్యంతో  ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది. భక్తి భావంతో  ఆనందంగా భక్తి పారవశ్యంతో సాగిపోయే పండుగల విధానాలు నేటి ఆధునికతతో క్రమేణ కనుమరుగైతున్నావేమో అని అనిపించక మానదు. పల్లెలు మొదలు పట్టణాల్లో తీరికలేని సమయంతో ప్రజలు తమ ఆధ్యాత్మికత చింతపై ప్రత్యేక దృష్టి సారించలేకపోవడం మధ్యలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం చేంతచేరిన కారణంగా పండుగలలో అనుసరిం చవలసిన విధానాలలోమార్పులు చేర్పులు చోటు చేసుకుంటూన్న విధానం లో  కంప్యూటర్‌ ‌మాయాజాలంలో ఆధునిక పూజా విధానం తయారవడం  పండుగలపై చాలా ఎక్కువనే ప్రభావితం చేస్తుంది అని చెప్పడంలో సంశయం లేదు పండుగ అనగానే రెండు మూడు రోజుల ముందు నుండే  ఇంటికి   రంగులు వేసి ఇంటి పరిసరాలు శుభ్రపరిచి మామిడి బంతి తోరణాలతో అలంకరించి కుటుంబ సమేతంగా అందరూ ఒక దగ్గర చేరి  సంతోషంగా చేసుకునే  పండుగలు ఇప్పుడు చాలా వరకు తక్కువే ,పేరుకు మాత్రం పండుగ రోజులు క్యాలెండర్లలో చూస్తే గుర్తుండడం తప్ప పండుగ రోజున అవలంబించవలసిన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో కలగలసి  కనుమరుగైతున్నావేమో అని అనిపించక మానదు భక్తి భవనలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి దేవాలయాల దర్శనాలు జరుగుతున్నప్పటికీ దేవాలయాలు కూడా సాంకేతిక సంతరించుకొని గుడి లోపల వరకు ఆధునిక పరిజ్ఞానం చొచ్చుకుపోయింది .

ఇంటర్నెట్‌ ‌వ్యవస్థలు యూట్యూబ్‌ ‌ఛానల్స్ ‌లలో కళ్ళముందు కదలాడేటట్లు మన కళ్ళ ముందు అనుకున్న ప్రదేశం చూసేందుకు  అనువైనదిగా శాస్త్ర పరిజ్ఞానం సెల్‌ ‌ఫోను రూపంలో చేతిలోకి వచ్చేసింది. మానవుని విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానాన్ని కంటే తక్కువైపోయి ఎక్కువ శాతం సాంకేతికత మీదనే ఆధారపడి బ్రతకడం అలవాటైపోతుంది.దేవాలయాల్లో కూడా కెమెరాలు ఏసీలు రిఫ్రిజిరేటర్లు కంప్యూటర్‌ ‌టెక్నాలజీ చాలావరకు వియోగ మవుతుంది. పల్లెలు పట్టణాలలో పండుగ పర్వదినాలను పురస్కరించుకుని డబ్బులను వసూలు చేసి వసుల దందాకు తెరతీస్తూ భక్తి పేరిట చేసే దందాలు అంత ఇంత కాదేమో.గడిచిన కాలంలో పండుగల విశిష్టత ఔన్నత్యం కనుమరుగు కాకపోయినా అవలంబించే విధానాలు  కొత్తదనాన్ని సంతరించుకొని నామ మాత్రంగా ఆధ్యాత్మికతను  ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను పుణికి పుచ్చుకొన్న రీతిలో   పండుగలు వచ్చినప్పుడు పండుగ వాతావరణాన్ని నిశ్చితంగా గమనిస్తే  నిజమేనేమో అని అనిపించకమానదు.

ప్రపంచీకరణ సాంకేతిక పరిజ్ఞానం మత సంస్కృతి సాంప్రదాయ వేషధారణలను ఎంతో కొంత ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు .ఆచారాల్లో భాగంగా పండుగలు ఆధ్యాత్మికత భక్తి భావాలకు జీవన విధానాలను ప్రతిబింబించే విధంగా గోచరిస్తుంటాయి. ప్రస్తుతం ఆధునికత సాంకేతికత మారుమూల ప్రాంతాలనూ సైతం చుట్టేయడం జీవన విధానాల్లో ఆచార వ్యవహారాలల్లో క్రమక్రమంగా పెను మార్పులు చోటు చేసుకోవడం వలన పండుగలు యొక్క విశిష్టత ప్రాధాన్యత కొంతమేరకు తగ్గిపోతున్న క్రమాన్ని పక్కన పెడితే పండుగంటే ఉల్లాసానికి ఆధ్యాత్మికతకు  మారు పేరుకు మాత్రమే ఉంటున్నట్ల అనిపిస్తున్న చాలావరకు ప్రజలు పండుగలలో పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా వేషధారణ కట్టుబాట్లు విధానాల్లో తేడాలు నేటి ఆధునిక జీవనంలో పండుగ పర్వదినాల్లో తరచుగా కానవస్తుంటాయి .నేటితరం ఆధునిక జీవితానికి అలవాటు పడిన ప్రజలు సాంకేతికత వైపే తమ దృష్టిని సాధించడం పండుగ పేర్లు మారకుండా పండుగ దినాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో చాలావరకు పబ్బులకు డిస్కో తెరఫీలకు అలవాటు పడిన నేటి యువత పండుగల పేరిట సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను చాలా వరకు పక్కన పెట్టి కేవలం పండుగలు వినోదం కొరకే అన్నట్లు ఆధ్యాత్మిక విధానాలను పక్కన పెట్టి సినిమా పాటల కల్చర్‌ ‌వైపే ఎక్కువ మోగ్గుచూపడం సర్వసాధారణమైపోతుంది .

పండుగల పేరిట చందాల దందా…
పండుగలు ప్రత్యేక సందర్భాలనుసరించి ఉండడం ఒక ఎత్తు అయితే పండగల పేరిట చందాలు వసూలు చేసి ఆధునిక పోకడలను అందిపుచ్చుకొని ఫ్యాషన్‌ ‌సంస్కృతికి తెరలేపి  శృతిమించిన వినోదం అంది పుచ్చుకొని ఆధ్యాత్మిక ఆచార సంప్రదాయాలను సంస్కృతిని ప్రభావితం చేయని ఇతర వ్యవహారాలను నడిపిస్తూ సాగుతున్న వ్యవహారం పండుగ రోజుల్లో సర్వసాధారణమైపోయింది.ఆధ్యాత్మికతకు అనుసంధానంగా సాంకేతికత  పరిజ్ఞానం అవసరమైనప్పటికీ కేవలం సాంకేతికతో మితిమీరిన భావజాలంతో పండుగ ప్రత్యేకతలను పక్కనపెట్టి పేరుకు పండుగను ముందట పెట్టి చేసే కార్యకలాపాలు   తీరు ఆశ్చర్యం కలిగించే విధంగా కొంతమంది లేనిపోని సమస్యలు.

తలెత్తే విధంగా పండుగ లను కొనసాగించడం శోచనీయమే..
ప్రత్యేకతను ప్రతిబింబించేలా పండుగలు చేసుకునే  విధానం ప్రజల యొక్క జీవనం వేషధారణను కట్టుబొట్టు అలవాట్లను సాంప్రదాయ వ్యవహార శైలిని ప్రతిబింబించే విధంగా సనాతన ఆచార వ్యవహారాలకు సాంప్రదాయాలకు మార్గదర్శకాలుగా ఉంటున్న  పండుగ రోజుల్లో కనిపిస్తున్న విధి విధానాలు చాలావరకు పూర్తిగా భిన్నంగా ఉండటం నేటి ఆధునిక సమాజంలో  చాలా వరకు పండుగల యొక్క ప్రాధాన్యత మారిపోతుందేమోనని అనిపిస్తుంటుంది.

మతాల్లో మార్పులు తక్కువైనా పండుగల్లో వచ్చే విధివిధానాల్లో మార్పులు ఆధ్యాత్మికతను కలబోసుకోకుండా  ఎక్కువగా సాంకేతికతో కృత్రిమ విధానాలతో పండుగలను జరుపుకోవడం ఏ మేరకు పండుగ యొక్క విశిష్టతను ప్రాధాన్యతను లక్ష్యాన్ని భావనను అనుసరించే విధానాలను జీవిత గమనంలో మానవతా విలువలకు అనుబంధాలకు ఆత్మీయతలకు విలువ నిచ్చే పండుగ యొక్క ఔన్నత్యం కుదించకపోయే రీతిలో నేటి సాంకేతికత పండుగలను ఒక పరిధిలోకి నెట్టేసిందని మానవ జీవన శైలి ఆలోచన ధోరణిలను కట్టిపడేసిందని చెప్పవచ్చు.

పండుగల సందర్భాల్లో కూడా దృశ్య శ్రవణ పరికరాలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు ఆధ్యాత్మిక చూపించే విధానమేమో కానీ భక్తిపారవశ్యంతో ఉండవలసిన భక్తులను గదిలో బదించేటట్టు చేసిందా అన్నట్లు  సాంకేతికత పరిజ్ఞానం మానవ జీవన శైలి విధానాలను ఆచార వ్యవహారాలను మార్చుకునే విధంగా తయారుచేసిందని చెప్పవచ్చు భిన్న సంస్కృతులు కలిగినటువంటి భారతదేశంలో ఒకప్పటి పండుగ విధివిధానాలు సాఫ్ట్వేర్‌ ‌యుగంలో తూతూ మంత్రంగానే ఉండేలా చేస్తున్నాయి . ఆధ్యాత్మిక భావజాలం శాస్త్ర  సాంకేతిక పరిజ్ఞానం సమానంగా సమపాలలో ఉన్నప్పుడే మానవ జీవనశైలి పండుగలు వాటి యొక్క ప్రాధాన్యత  విషయాలు స్పష్టంగా తెలుసుకునేటట్లు ముందు తరాలకు మంచి సాంప్రదాయాలను అందించినట్లు అవుతుందేమో..

ఆచార వ్యవహారాలలో పొడచూపుతున్న మార్పులు..
పండుగ సందర్భాల్లో ఆచార వ్యవహారాలుగా ఉన్న కట్టుబాట్లలలో చాలావరకు మార్పులు వస్తున్నాయి వేషధారణలో ఆధునిక సంస్కృతి కనిపిస్తుంటుంది.పట్టణాలు మొదలు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సైతం కట్టుబాటులో తేడాలు వస్తూన్నా పండుగ సందర్భాల్లో కనీసం తమ ఆచార వ్యవహారాలను సమృద్ధిగా గోచరించేటట్టు సమయాన్ని గడపడానికి వీలు లేని జీవనం విధానం ముందుకు సాగడం శోచనీయమం .పండుగల పేరట జరిగే మోసాలు ఎక్కువే .దేవుళ్లనీ విశ్వసించే  ప్రజలను హైటెక్‌ ‌విధానాలతోమోసం చేసే కొంతమంది స్వామీజీలు లేకపోలేదు.

పండగల విశిష్టత ఆధ్యాత్మికతతోనే….
శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెంది పండుగలను ప్రభావితం చేస్తున్న ప్రజల్లో మూఢ విశ్వాసాల సరళి ఇంకా తగ్గలేదు ఆధునిక యుగంలో మూఢ విశ్వాసాలతో నష్టపోతున్నవారు లేకపోలేదు.నేటి ఆధునికత మతాలు యొక్క విశేషాలను మానవ జీవన విధానాలను పండుగలు యొక్క ప్రాధాన్యతను తమకు తమకు తాముగా ఆలోచింప చేయలేనంత స్థాయికి నేటి ప్రజల జీవన విధానాల్లో సాంకేతిక పరిజ్ఞానం బలమైన ఆయుధంగా మారింది.

ఏదేమైనా  శాస్త్రసాంకేతి పరిజ్ఞానం ఎంత ముఖ్యమో పండుగలలో ఆచార వ్యవహారాల్లో మానవ జీవన శైలి లో కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను మార్చుకోకుండా భవిష్యత్‌ ‌తరాలకు పండుగల యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా పండుగ రోజైనా పండుగ వాతావరణం స్పష్టంగా ప్రతిబింబించేలా విధానాలతో పరిపూర్ణమైన ఆధ్యాత్మికతతో పండుగను జరుపుకుంటే సాంకేతిక పరిజ్ఞానంలో ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక జీవనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం తో అభివృద్ధి దిశలోముందుకు పోతే ఆరోగ్యకర మైన జీవన విధానాలతో పండుగలను చేసుకుంటే భావితరాలకు ఆదర్శప్రాయంగా పండుగ వాతావరణం చిరకాలం చిరస్మరణీయంగా వర్ధిల్లుతుంది. …..
– దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా .
9492097974.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *