తాండూరు ప్రజాతంత్ర జులై 17: పంచాయతీ సిబ్బంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘo జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 40 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో నిత్యం పారిశుద్ధ్య పనులు మంచినీటి సరఫరా తదితర అనేక పనులలో గ్రామాలను ఉంచుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న గ్రామపంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులను పంపుతూ స్పెషల్ డ్రైవ్ పేరుతో గ్రామాలలో నాలుగు రోజులుగా కొత్తగా కార్మికులను పెట్టి పనులు చేయాలని అధికారులను ఆదేశించడాని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జిల్లాలోని కేంద్రంలో పంచాయతీ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు లేవని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ముందు మా సమస్యలు పరిష్కరించాలని గ్రామాలలో మేము చేసే పని ఇతరులతోటి చేయిస్తే తక్షణమే అడ్డుకుంటామని మా పొట్ట మీద కొట్టొద్దని వివరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరం కోసం కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సిములు జిలాని సాయ్యప్ప అంజిలప్ప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



