అవకాశ ఆశల ఆకాశంలో గద్ద
ఎర ల వల వేస్తుంది
గద్దె కోసం స్వేచ్ఛ లేని ఫామ్ కోడి
ఎగిరి పోవడానికి చూస్తుంది
బోయవాడు- పావురాల కథ విన్న
తెలివైనవిజి
వల తో సహా ఎగిరిపోతున్నవి
ఆవలి వైపు క్యాంపు గూళ్ళు
సిద్ధమైపోతవిజి
సిగ్గు తప్పిన కోరికల కోడి పక్కింట్లో
గుడ్లు పెట్టి వస్తుంది
గంప కింద కమ్మండి సరిపోతుంది
గద్ద అంటే తెలియని అమాయక
పిల్లలు కావు
గద్దె కోసం తల్లిని ఎడవాసి
ఎగిరిపోతున్నవి!
క్యాంపుల్లో ప్రజాస్వామ్యాన్ని
తూకం వేస్తున్న కాలం!
రాజకీయ కూటాలు తెరిచిన కవాటాలు
వాటమైన వైరి పక్షాల కపటాలు
ప్రలోభాల వలలో చిక్కిన కీటకాలు
హాజరు గైర్హాజరుల బ్రమరాలు
క్యాంపు గూళ్ళలో రెక్కలు విప్పి
రూపు మార్చుకొనే సీతాకోకచిలుకలు!
ఏ గూటిలో వాలితే ఆ గూటి
పాట పాడే పంచదార చిలుకలు
పరిమితి మించితే పుట్టిని ముంచే
చిల్లులు!
-పి.బక్కారెడ్డి 9705315250




