నేను అధ్యక్ష రేసులోనే ఉన్నా

తప్పుకున్నానంటూ వస్తున్నవన్నీ వదంతులే

వీడియో సందేశాన్ని విడుదల చేసిన శశిథరూర్‌

‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తాను విరమించుకునే ప్రసక్తే లేదని శశి థరూర్‌ ‌స్పష్టం చేశారు. ఈ పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు ’ఢిల్లీ వర్గాలు’ చెప్పాయంటూ ప్రచారమవుతున్నవన్నీ  వదంతులేనని తెలిపారు. పోటీ నుంచి తాను తప్పుకునేది లేదని తెలిపారు.ఈ పుకార్ల గురించి తనకు కొందరు ఫోన్‌ ‌చేసి చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈ నెల 17న జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే , శశి థరూర్‌ ‌పోటీ పడుతున్నారు.

థరూర్‌ ‌పోటీ నుంచి తప్పుకున్నారని ఢిల్లీ వర్గాలు చెప్పాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శశి థరూర్‌ ఓ ‌వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను శనివారం పోటీ నుంచి ఉపసంహరించుకోబోతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయని వదంతులు ప్రచారమవుతున్నాయని తెలిపారు. ‘నేను కు ఓ హా ఇస్తున్నాను. నేను సవాల్‌ ‌నుంచి వెనుకకు తగ్గేది లేదు. నా జీవితంలో ఎన్నడూ అలా వెనుకకు తగ్గలేదు, ఇకపై కూడా తగ్గబోను‘ అని తెలిపారు. ఇది పోరాటమని, ఇది స్నేహపూర్వక పోటీ అని తెలిపారు. పార్టీలోపలే ఈ పోటీ జరుగుతోందన్నారు. అయితే ఈ పోటీ చివరి వరకు కొనసాగుతుందన్నారు. పోటీ చివరివరకు బలంగా ముందుకెళతానని చెప్పారు. ఈ నెల 17న తనకు ఓటు వేయాలని కోరారు. రేపటి గురించి ఆలోచించాలని, థరూర్‌ ‌గురించి ఆలోచించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *