కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : కాంగ్రెస్ నాయకుల ఆద్వర్యంలో మండల పరిధిలోని నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ లు మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ,స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ గాంధీ పుట్టిన దేశంలో మద్యపానం నిషేధించాలని,మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా ధైర్యంగా వారి ఇంటికి వెళ్తారో అప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు అని తెలియ జేసారు.ఈ కార్యక్రమంలో గంగుల చంద్రా రెడ్డి,బలవంత్ రెడ్డి,కాసుల జంగారెడ్డి,మర్ల రాములు,గడిగే రాములు గౌడ్,యండి. అమీన్ బేగ్,నర్సింహా రెడ్డి,వెంకప్ప,సోహైల్ బేగ్,శైబాజ్ బేగ్,ఖాజా పాషా, జమాల్,సుధాకర్ రెడ్డి,రాములు,నాగేష్ గుప్తా,మహిళలు పాల్గొన్నారు.
నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు





