తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఎం మాణిక్ రావు మహారాజ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా బీసీల ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ,తెలంగాణ అభినవ సర్దార్, ఉద్యమంలో జైలు కెళ్లిన ఉద్యమకారుడు స్వర్గీయ మాజీమంత్రి ఏం మాణిక్ రావు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతిని నిర్వహించినట్లు తెలిపారు.కావున ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ ఎస్ సి ఎస్ టి మైనార్టీ నాయకులు, అభిమానులు, రాజకీయా నాయకులు వ్యాపారవేత్తలు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.




