వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారంలో గల శ్రీ సద్గురు సాయిరాం ఆసుపత్రి ఆవరణలో సత్యసాయి సేవా కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఆదివారం ఉదయం 10 గంటలకు హుమ్నాబాద్ మాణిక్ ప్రభు పాదుకా పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవ కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అనంతరం తీర్థ ప్రసాదులు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మన ప్రభు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నేడు సాయిరాం ఆస్పత్రి ఆవరణలో మాణిక్ ప్రభు పాదుకా పూజా




