తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నేడు తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ లో నూతనంగా నిర్మించిన వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నట్లు తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తెలిపారు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఫంక్షన్ హాల్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తాండూరులో ఎక్కడా లేని విధంగా సుమారు 3 ఎకరాల స్థలంలో ఫంక్షన్ హాల్, ఒక ఎకరా స్థలం లో పార్కు, అధునాతన హంగులతో, అన్ని వసతులతో పూర్తి స్థాయి ఎసి హాల్ లతో సుందరంగా తీర్చిదిదద్దినట్లు చెప్పారు. కన్వేన్షన్ ప్రారంభోత్సవం సందర్భంగా గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
నేడు వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం





