మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్వర్యంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ నెల 21న మంగళవారం ఎల్బీనగర్ చింతల కుంటలోని ప్రల్లవి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులిపాటి త్రివేది, అధ్యక్షుడు తోట సుదేష్ కుమార్( రాజు) తెలిపారు. సోమవారం ఆర్కే పురంలోనీ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పొన్నం లక్ష్మయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి, టి డబ్లు అర్ డి సి చైర్మన్ ప్రకాష్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోత్తం, సంఘం సలహాదారులు కోట్ల శ్రీనివాస్, మిద్దెల జితేందర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మున్నూరు కాపు కుల సోదరులు, ఆత్మీయులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనంతుల నవీన్, ట్రెజరీ అక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం




