నేడు మహేశ్వరానికి మంత్రి హరీష్ రావు రాక

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: మహేశ్వరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు గురువారం మధ్యాహ్నాం రెండుగంటలకు ప్రారంభించనున్నట్లు ఎంపీపీ రఘుమారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అంతకు ముందు ఎంపీపీ రఘుమారెడ్డి, ఆసుపత్రి వైద్యులు రాజ గోపాల్ ఏర్పాట్లను పరిశీలించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమములో బి ఆర్ ఎస్ నాయకులు కరోళ్ల చంద్రయ్య, కూన యాదయ్య,ఎం నవీన్,అంద్యా నాయక్ తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *