ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 5 : నేడు ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు.బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమావేశాలు ప్రారంభిస్తారని తెలుపుతూ పార్టీ కమిటీలు, ఇతర ముఖ్య విషయాలపై దిశానిర్దేశం .. తీర్మానాలు, చర్చలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామన్నారు.





