నేడు నామినేషన్ వేయనున్న మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 8: గురువారం తన అనుచరులతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో తన నామినేషన్ వేస్తున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాతంత్రతో ఆయన మాట్లాడుతూ,వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.బిఆర్ఎస్ తో కలయిక చెందిన ప్రజలు తమవైపే మొగ్గుచూపుతున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్,బిజెపిలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని ఆయన వెల్లడించారు.ఆరు గ్యారెంటీల పథకంతో ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సుముఖంగా లేరని ఆయన పేర్కొన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలు నెరవేరేమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మడానికి సుముఖంగా లేరని ఆయన తెలిపారు.ఢిల్లీలో ఉన్న రాజీవ్గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇస్తున్న హామీలు తెలంగాణలో నెరవేరవని వాటిని ప్రజలు ఆదరించరని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అన్నితానై నడిపిస్తూ ప్రజలకు తెలంగాణలో ఒక దేవుడు అయ్యాడని ఆయన కొనియాడారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తప్ప కాంగ్రెస్,బిజెపి ఇతర పార్టీలకు స్థానం లేదని ఆయన ఖరాఖండిగా తెలియజేశారు.పూర్తి స్థాయిలో ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.తాను నామినేషన్ వేసిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు పూర్తిగా ప్రతిపక్షాలకు గుణపాఠం అయ్యే వీలుగా నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా తాను చేసిన అభివృద్ధికి నిలువెత్తు ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారని ఆయన తెలిపారు. వృద్ధులకు,వికలాంగులకు వారి కుటుంబంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్న కేసీఆర్ పట్ల సానుభూతి నేటికీ నెలకొని ఉందని ఆయన తెలియజేశారు. ఏది ఏమైనా,ఆరు నూరైనా బిఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆయన పేర్కొన్నారు.గురువారం రోజు ప్రజల అండదండలతో కార్యకర్తలు, నాయకులతో అభిమానులతో పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.తాను ప్రజల మధ్యలో ఎల్లవేళలా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు చాలా కృషి చేశానని,సమస్యలు సైతం పరిష్కరించానని ఆయన వెల్లడించారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ను ఓటర్లు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *