నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ

 క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు.
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ చేయనున్నట్లు క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రిస్టమస్ వేడుకలు నిర్వహణ కమిటీ సభ్యుల సూచన మేరకు నేడు 23.12.2023 శనివారం మధ్యాహ్నం 1 గంటలకు వైట్ ప్యాలస్ ఫంక్షన్ హాల్ , అంతరం రోడ్ నందు క్రిస్టమస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్టమస్ గిఫ్ట్( దుస్తులు ) ల పంపిణీ మరియు విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమమునకు నియోజకవర్గం లోని క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు అందరూ హాజరుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *