నేడు ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ఆమనగల్లు మండలంతో పాటు ఆమనగల్  మున్సిపాలిటీలో ఈనెల 29 మంగళవారం పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.ఉదయం10. గంటలకు ఆకుతోటపల్లి గేట్ టు పోలేపల్లి ఎక్స్ రోడ్ వయా సింగంపల్లి వరకు రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, 11.00 గంటలకు పోలేపల్లి టు జంగారెడ్డిపల్లి బీటి రోడ్డు రేణివల్  రూ.3 కోట్ల 20 లక్షలు పోలేపల్లి గేటు దగ్గర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.11.30 ని,, లకు పోలేపల్లి టు మంగళ కుంట తండా బిటీ రోడ్డు రెన్యువల్  రూ.64 లక్షలతో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని..12.00 గం.. పోలేపల్లి టు కొత్త కుంట తండా బీటీ రోడ్డు రూ. కోటి యాభై లక్షలు, కొత్తకోట తండాలో శంకుస్థాపన, కొత్త గ్రామ పంచాయతీ  భవన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 1.00 గం,  చెన్నంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 2.00 గం. అమనగల్లు మున్సిపాలిటీ  పూసల భవనం, గౌడ భవనం, యాదవ సంఘల భవనాలకు భూమి పూజ చేయనున్నారు. 4.00 గం. అమనగల్లు పట్టణం రైతు వేదిక దగ్గర సీసీ రోడ్డు  భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మండల మరియు మున్సిపల్ అధికారులు మండల గ్రామాల మరియు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *