ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఆమనగల్లు పట్టణంలో ఈనెల 25న కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. మధ్యాహ్నం జరిగే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.
నేడు ఆమనగల్లుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక



