నామినేషన్, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహింబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా ఆత్రం సుగుణ ఇంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పని చేశారు. ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.




