ప్రస్తుత పరిస్థితులలో సూర్యుని దగ్గరకు అంతరిక్ష వాహనాన్ని పంపించలేము. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రము.ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు మాత్రమే. అందుకే సూర్యుని పరిస్థితిని అధ్యయనం చేస్తే ఇతర నక్షత్రాల గుట్టు కూడా తెలుసుకోవచ్చు. 1868లో ఆగస్టు 18న సూర్యగ్రహణం సందర్భంగా జూల్స్ జాన్సన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సూర్యుడులో హీలియం అనే మూలకము ఉంటుందని కనుగొన్నాడు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో ఇప్పుడు మన దృష్టి అంతా సూర్యుని మీద పడింది. నేడు అనగా సెప్టెంబరు 3వ తేదీన శ్రీహరికోట లోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ఆదిత్య ఎల్ 1 అనే నౌకను పిఎస్‌ఎల్‌విసి 57 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించబోతున్నారు.
సౌరవాయు ఆవర్తనాన్ని సుదూరం నుండి పరిశీలించడానికి, సూర్యుని వెలుపల ఉన్న పొరలు సౌరవాయు ఆవర్తనాన్ని, సౌర శక్తి కణాలు, వేరు వేరు తరంగ పౌనః పున్యాల వద్ద ఫోటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం) , కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు గ్రహణాలు వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారకుండా భూమికి సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్షలోకి నౌకను ప్రవేశపెడతారు. లెగ్రాంజ్ పాయింట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ చిన్న వస్తువు కూడా స్థిరంగా ఉండగలుగుతుంది. ఇక్కడ భూమి సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. సూర్యునికి భూమికి మధ్యలో ఇటువంటి పాయింట్లు ఐదు ఉంటాయి. అందులో ఎల్ 1 అనే పాయింట్ వద్దకు ఇప్పుడు మనము ప్రయోగించబోయే వ్యో చేరుకుంటుంది. అందువలనే ఇప్పుడు మనము ప్రయోగించబోయే వ్యోమనౌక పేరు ఆదిత్య ఎల్ 1 గా తీసుకోవడం జరిగింది. ఈ పాయింట్ నుండి పరిశోధనా సమయంలో గ్రహణాలు వంటి ఇతర అడ్డంకులు ఏమీ లేకుండా నిరంతరం సూర్యుణ్ణి పరిశీలించే సౌలభ్యం ఉంది.
భూమి నుండి ఈ నౌక ఈ కేంద్రానికి చేరుకోవడానికి సుమారుగా 175 రోజులు పడుతుంది . ఈ ఉపగ్రహం వరకు 1500 కేజీలు. ఇది ఏడు పే లోడ్ లను మోసుకెళ్తుంది. అందులో మొదటిదైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ సూర్యగోళం నుండి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనాన్ని రెండవదైన సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ 200-400 నానో మీటర్ల తరంగదైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని, మరియు ఇది 11 ఫిల్టర్‌లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలోని వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందించడం, మూడవది ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ సౌర గాలి యొక్క వైవిధ్యం మరియు లక్షణాలను అలాగే దాని పంపిణీ మరియు వర్ణపట లక్షణాలను అధ్యయనం చేయడం, నాల్గవదైన ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ సౌర గాలి మరియు దాని శక్తి పంపిణీ యొక్క కూర్పును అర్థం చేసుకోవడానికి, ఐదవదైన సోలార్ లోఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజం అధ్యయనం కోసం , ఆరవదదైన హై ఎనర్జీ•1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్‌లను గమనించడానికి మరియు విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌర శక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేయడానికి , ఏడవడదైన మాగ్నెటోమీటర్ అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం మరియు స్వభావాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి.
వ్యోమనౌక మొదటి లాగ్రాంజ్ పాయింట్‌లో ఉండటంతో, ఈ పేలోడ్ సూర్యుడిని అంతరాయం లేకుండా నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి ఉపయోగించే పరికరాలను బెంగుళూర్లోని యూ ఆర్ రావు ఉపగ్రహ కేంద్రం నుండి షార్ కి చేరాయి. అంతేగాక వీటి పనితీరుపై పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతం కావాలని కోరుకుందాం. జై భారత్… జై జై భారత్. •

డి.జె మోహనరావు
యం.యస్సీ (ఫిజిక్స్)
అధ్యాపకులు
ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
9440485824
డి.జె మోహనరావు
యం.యస్సీ (ఫిజిక్స్)
అధ్యాపకులు
ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
9440485824




