హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తెను పురస్కరించుకుని శని,ఆదివారాల్లో రెండ్రోజుల పాటుచేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు బస్సులు నడుపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌సుఖ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల బజార్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల పక్రియ ప్రారంభం కానుంది. పదవీ విరమణకు 3 ఏండ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో రేపట్నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ పక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల పక్రియ ప్రారంభం కానుంది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల పక్రియ జరగనుంది.




