నేటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు

  • సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం
  • అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ ‌తరపున పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, జేడీఎస్‌ ‌నుంచి ఎంపీ దౌవెగౌడ హాజరయ్యారు. వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున మార్గాని భరత్‌, ‌తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్‌, ‌కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌హాజరయ్యారు.

పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్‌ ‌జోషి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ ‌నాధ్‌ ‌సింగ్‌, ‌మరో కేంద్రమంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌పాల్గొన్నారు. ప్రధానమంత్రి హాజరు కావాల్సి ఉండగా ఎందుకనో రాలేక పోయారు. ఇదిలా ఉండగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్కర్‌ ‌మంగళవారం సాయంత్రం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ వి•టింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజ్యసభ ప్లోర్‌ ‌లీడర్లు హాజరయ్యారు. లోక్‌ ‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్‌ అడ్వైజరీ వి•టింగ్‌లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు, కీలక బిల్లులకు సమయం కేటాయింపు వంటి కీలక అంశాలపై బిజినెస్‌ అడ్వైజరీ వి•టింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమై డిసెంబర్‌ 29 ‌వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 రోజులు సభ సమావేశం కానుంది. శీతాకాల సమావేశాలు పార్లమెంటు పాత భవనంలో జరగనున్నాయి. ఇది 17వ లోక్‌సభకు 10వ సెషన్‌ ‌కాగా, రాజ్యసభకు ఇది 258వ సెషన్‌. ఈ ‌సమావేశాల్లో అత్యధికంగా శాసనసభ పనులు జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీంతో పాటు ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై అర్థవంతమైన చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి మాట్లాడుతూ, సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారం కోరుకుంటున్నదని, ఈ సమావేశాల నిర్వహణలో ప్రతిపక్షాలు కూడా సానుకూల పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *