శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్ సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్, అన్నవరం, భద్రాచలం, జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సీతానగరం, సింహాచలం, శంషాబాద్ ముచ్చింతల్, త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామి లాంటి పుణ్యక్షేత్రాల్లో అంగరంగ వైభవంగా కాత్యాయని వ్రతం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో పరమహంస వరి వ్రాజక స్వామి శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనాలతో ప్రతి వైష్ణవుడు గోదాదేవిని (ఆండాళ్ తల్లి) ఆచరించిన తిరుప్పావై కాలక్షేపం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ధనుర్మాసంలో వైష్ణవులు ఆచరించే శ్రీ వ్రతంలో భాగవతుల సేవ భగవంతుని సేవ రెండూ కలగలిసి ఉంటాయి.
కార్తీకదీపాల దివ్యకాంతులతో శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మ అయిన మార్గశిరం అవతరిస్తుంది.’మాసానాం మార్గ సీర్సోహమం’మాసాలలో మార్గశీర్షం నేనే అని భగవానుని వాక్కు మార్గం అంటే భగవానుని పొందే దారి. భగవానుడే అనే అచంచల విశ్వాసాన్ని పెంపొందింప జేసే పరాలలో కైంకర్య భాగ్యం భాగ్యం ఇచ్చేదే మార్గ శీర్ష వ్రతం. అదే ధనుర్మాస వ్రతం. జన్మ కర్మ చ మే ద్విమ్ అని శ్రీకృష్ణుడు అన్నట్టు, గోదాదేవి జన్మ, కర్మ,జ్ఞానం, భక్తి ,ప్రపత్తి ఆచార్య బి మానం అన్ని దివ్యము, భవ్యము అయినవే. ఆమె అయోనిజ. జనకునికి నాగేటి చాలు లో సీత లా, పెరియాల వారులైన విష్ణు చిత్తునికి తులసీ వనంలో లభించింది. ప్రసిద్ధ దివ్య క్షేత్రం శ్రీవల్లి పుత్తూరులోని అర్చామూర్తి శ్రీ వటపత్ర సాయికి అనుదినం పుష్పమాల కైంకర్యంచేస్తున్న విష్ణు చిత్తులు, ఆ చిన్న శిశువుకు’ కోదై’(పూలదండ) అని నామకరణం చేసి, అల్లారి ముద్దుగా పెంచారు. విష్ణు చిత్తులు కోదైకి ఆలయంలోని ఆచామూర్తి వైశిష్టియాన్ని తీర్థప్రసాదాలతో రంగరించి పోశారు. ఆ బాలికకు శ్రీకృష్ణుడిపై ఇష్టం కలిగింది.
ఆ ఇష్టం ప్రేమగా, దిన దిన ప్రవర్ధమానమైంది. యుక్త వయసు వచ్చేసరికి గోదాదేవికి శ్రీ రంగనాథుడి ని వివాహం చేసుకోవాలని కోరిక పుట్టడంతో స్వామికి భాగ్యమైన తులసీమాలకు సరిపి తూగుతున్న అని చూసుకోవడానికి, ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందు ధరించి, ఆలయం బావి నీటిలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయేది. తాను ధరించిన మాలలను ప్రేమతో స్వామికి ప్రేమ కానుకలుగా స భక్తికంగా సమర్పించేది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ప్రౌడబందమైన ఆముక్తమాల్యదలో గోదాదేవిని ‘ శూడి కొడుత నాచ్చియార్’ (తాల్చి ఇచ్చిన అమ్మ) అని గోదాదేవి, తండ్రికి తెలియకుండా పూలమాలలను పెరుమాళ్ల సన్నిధికి తీసుకెళ్ళి పూలబుట్టలో పెడుతుండగా, ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుచిత్తులవారు, ఆ రోజు పెరుమాళ్లకు పుష్పకైంకర్యం చేయడు. ఆ రాత్రి విష్ణుచిత్తునికి పెరుమాళ్ళు స్వప్నదర్శనమిచ్చి, గోదాదేవి ధరించిన మాలనే తనకు కైంకర్యం చేయాలని ఆజ్ఞాపిస్తాడు. అంతే కాక, ఆండాళ్ ను శ్రీరంగానికి తోడ్కొని రమ్మని, శ్రీరంగనాథుడు సెలవిస్తాడు. ఆండాళును పల్లకిలో ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకువెళతారు.
శ్రీరంగనాథుడు ఆండాళును పాణిగ్రహణం చేసేందుకు తన సంసిద్దతను తెలియజేస్తాడు. పెరియాళ్ళార్ విష్ణు చిత్తులవారి కోరిక మేరకు శ్రీవిల్లిపుత్తూరులో వివాహానికి ఏర్పాటు చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథుల వారు గరుడవాహనంపై వచ్చి గోదమ్మ తల్లిని వివాహం చేసుకుంటాడు. శ్రీరంగనాదుని ఎడమ వైపు గరుడుడు, కుడివైపు ఆండాళు వుండే గ్రహాలు, నేడు కూడా శ్రీవిల్లిపుత్తూరులో దర్శనమిస్తాయి.ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన -త్యాయనీ వ్రతాన్ని గురించి, గోదకు, చిన్ననాడే, విష్ణుచిత్తులు ప్పడంతో, శ్రీవిల్లిపుత్తూరునే రేపల్లెగా, అక్కడ కొలువైన వటపత్రశాయినే శ్రీకృష్ణుడుగా భావించి, అండాళ్ తల్లి, తన చెలికత్తెలు గోపికలుగా, ఆ భావనాప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. లోకంలో అందరూ ఈ సిరి నోమును పూని సౌభాగ్యం పాతురం పొందాలని, వ్రతవిధానమంతా ఆ తిరుప్పావై దివ్యప్రబ ంధరూపంలో లోకానికి అందించింది. ఈ విధంగా లోకాన్ని ఉజ్జీవింపచేసింది. కనుక, ఆమె ఆండాళ్ అయ్యింది. ‘ఆండాళ్’ అంటే ‘ఉద్ధాపకురాలు’ అని అర్ధం.
కొలునా తిరుప్పావై తరూపంలోని దివ్యద్రావిడ ప్రబంధం, అపూర్వకావ్య గౌరవం పొందిన 30 పాశురాల మణిదీపావళి. లేమా అపురూప ఉపనామాలతో ఆండాళ్ ఈ గ్రంథాన్ని అలంకరించింది. ‘నీళా తుంగస్తన గిరితటీ సుప్త ముద్భోధ్య కృష్ణమ్’. వుంటు‘పల్లాణు పల్లాణు పల్లాయిరత్తాణ్డు పలకోడి నూరాయిరం’ వీక్షి ‘శ్రీశైలేశద యాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్’ అంటూ, కావే ‘మార్గళి త్తింగళ్మది నిజైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్ పోదుమినో నీడల నేరిడయీర్’ అంటూ, మొదటి పాశురాన్ని గొంతెత్తి ఆలపించింది. ఈ తిరుప్పావైలోని ప్రతి చరణం శ్రీచరణాన్ని కొల ఆశ్రయింపచేస్తుంది. మొదటి 5 పాశురాలలో వ్రతపూర్వరంగం, వ్రతాంగాలు, వరుణ దేవునికి ఆహ్వానం, కర్మసిద్ధాంతంపై జర ఆసక్తకరమైన చర్చ, నామసంకీర్తనం ఉంటాయి. 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు, ఇంకా నిద్రలేవని పదిమంది గోపికిలను మేల్కొలిపి వ్రతంలో చేర్చుకుంటుంది. 16 నుండి ముప్పయ్యో పాశురం వరకు, ఆచార్యుడై, నందగోపుణ్ని, యశోదమ్మనూ, బలరాముణ్నీ మేల్కొలిపి, తరువాత నీలాదేవిగా, పురుషాకారంతో శ్రీకృష్ణుని మేల్కొలిపి, మంగ ళాసనం చేసి తమ వాంఛితాలను తీర్చమని వేడుకుంటుంది.
గోదాకళ్యాణ వైభోగంగోదాదేవి గానం చేసిన తిరుప్పావై ముప్పై పాశు రాలను, భక్తితో క్రమం తప్పకుండా పఠించేవారికి, తనకు లభించిన ఫలమంతా లభిస్తుందని మంగ ళాశా సనం చేసింది. గోదను రంగనాయకిని చేసిన ఈ వైభవానికే ‘భోగం’ అని పేరు. ఆ నాటి ( నుంచి గోదారంగనాథుల కల్యాణ దినానికి భోగి అనే పేరు వచ్చింది. అదే సంక్రాంతి ముందు భోగి పండుగ.
‘ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్’ అంటూ నమస్కరించి మహిళలు ఉదయాన్నే మంగళహారతులు ఇచ్చి మేలుకొలుపుతారు. ‘శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్.శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ, డల్ కంద మాదవనైక్కేశవనై అంటూ చివరి పాశురం ఆలపిస్తారు.
‘‘’’కర్మటే పూరవ ఘల్గుణ్యాం తులసీ కాననోద్భవామ్ పాండ్యేవిశ్వంభరాం
గోదాం శ్రీరంగనాయకీమ్’ అంటూ ఆండాళ్ తల్లిని కొలుస్తారు.
‘అమ్మ మాయమ్మ మాయమ్మ ముద్దులగుమ్మ మంగళమమ్మ ‘అమ్మా’ అనే మంగళ హారతి గీతం మృదుమధురంగా, వినసొ ంపుగా వుంటుంది. శ్రీరంగంలో రాత్రిపూట పవళింపు సేవాకార్యక్రమం వీక్షిస్తే, మోక్షానికి సుగమం అవుతుందని భక్తులు చెప్పుకుంటారు..్న కావేటి రంగరంగా, మా యన్న కస్తూరి రంగ రంగా దేవకి వసుదేవుని నీడలో నీడవయి వున్నావయ్మా’ అంటూ వీణ – తంబురాలతో -పవళింపు సేవాకార్యక్రమం చేస్తూ శ్రీరం గనాథుణ్ని మనసారా కొలుస్తారు.మలయప్ప దివ్యక్షేత్రమైన తిరుమ లలో ఘనంగా జరుగనున్న తిరుప్పావై, తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో జరిగే శేషసేవలు శ్రీనివాసుని వక్షస్థంలోని అమ్మవార్లకు కుడివైపు బంగారుచిలుక బొమ్మనూ, ఎడమవైపు చిలుక బొమ్మనూ అలంకరిస్తారు. అవే కాకుండా ధనుర్మాసంతా సుప్రభాతసేవకు తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు. ప్రతిరోజూ కాం తసేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులు ఆ పక్కనే వున్న ముద్ద శ్రీకృష్ణునికి శయనభాగ్యం కలిగిస్తారు.




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల