నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. మంగళవారం నేచురోపతి వైద్యంపై నిర్వహించిన సవి•క్షలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ప్రజల్లో నేచురోపతి (ప్రకృతి ) వైద్యం పైన పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అందుకు కావాల్సిన సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధి పొందిన మంథని సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. నేచర్‌ ‌క్యూర్‌ ‌విభాగం నుండి ప్రత్యేక బృందాన్ని విజయవాడలోని మంథని సత్యనారాయణ నేచురోపతి హాస్పిటల్‌కు పంపాలన్నారు. అక్కడ అందుతున్న సేవలు, భోజన డైట్‌, ఇతర సదుపాయాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌లో నేచురోపతి ఓపీ, ఐపీ సేవలను మరింత మెరుగుపరిచి, అందుకు అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రకృతి వైద్యం కాబట్టి హాస్పిటల్‌లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు. అదేవిధంగా నేచురోపతికి ప్రత్యేక భోజన డైట్‌ ఉం‌టుంది కాబట్టి వాటికి కావాల్సిన వంట గది, సామాగ్రి సమకూర్చాల న్నారు. రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యులను, సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, ఆయుష్‌ ‌కమిషనర్‌ ‌ప్రశాంతి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌, ‌సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, ‌ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *