నూతన ప్రజా ప్రభుత్వానికి శుభాకాంక్షలు

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్07: తెలంగాణలో  ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిగా మరియు పలుమంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లా అధికారులందరూ నూతన ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నిబద్ధతతో ప్రజా ప్రభుత్వానికి మరింత మంచిపేరు వచ్చేలా కష్టపడి పనిచేసి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టిజీవో అసోసియేషన్ అధ్యక్షులు యం.బి.కృష్ణయాదవ్, కార్యదర్శి యం.ఎ. ఖాదర్, శ్రీనేష్, ఏంజులరెడ్డి, మంచాల రవీందర్, స్వరూపరాణి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *